గొప్ప సువార్తికుని జీవిత సాక్ష్యం ✝️🔥 Joe Jacob Testimony
గొప్ప సువార్తికుని జీవిత సాక్ష్యం ✝️🔥 Joe Jacob Testimony
JOHN WESLY
Brother Joe Jacob Testimony చిన్నప్పటి నుంచి మంచి విద్యా, కుటుంబ నేపథ్యంతో పెరిగిన ఈ వ్యక్తి… తన జీవితంలో 42 సంవత్సరాల వరకు లోకరీతిలో జీవించాడు. కానీ కరోనా కాలంలో దేవునిని తెలుసుకున్న అనుభవం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. తన జీవితంలో నిజమైన శాశ్వతమైనది ఏమిటో తెలుసుకున్న తర్వాత, ఇక తన కోసం కాకుండా దేవుని కోసం జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఎవరూ చేయని విధంగా సువార్తను ప్రకటించాలనే భారాన్ని దేవుడు ఆయన హృదయంలో ఉంచాడు. హాస్పిటల్స్ దగ్గర, రోడ్ల పక్కన, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఒక వాక్యాన్ని బోర్డుపై రాసుకుని నిలబడి, ఆ బోర్డును ప్రజలకు చూపిస్తూ యేసుక్రీస్తు సువార్తను అనేకమందికి ప్రకటిస్తున్నాడు. లోకంలో మనం సంపాదించేది, నిర్మించేది, సాధించేది అన్నీ ఒకరోజు ముగిసిపోతాయి. కానీ దేవుని కోసం చేసిన పని, ఒక మనిషిని క్రీస్తు దగ్గరకు తీసుకురావడం — శాశ్వతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. “నేను పరలోకానికి వెళ్లడం మాత్రమే కాదు… కనీసం పది మందినైనా నాతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలి” అనే భారంతో ఈ సువార్తికుడు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు.