✝️చెడు వ్యసనాల బానిస నుంచి క్రీస్తు సైనికుడిగా! Christian Testimony 🎙️ JW Kingdom Podcast Ep#07

✝️చెడు వ్యసనాల బానిస నుంచి క్రీస్తు సైనికుడిగా! Christian Testimony 🎙️ JW Kingdom Podcast Ep#07
Podcast Episode

✝️చెడు వ్యసనాల బానిస నుంచి క్రీస్తు సైనికుడిగా! Christian Testimony 🎙️ JW Kingdom Podcast Ep#07

JOHN WESLY

చిన్నప్పటి నుంచే హాస్టల్లో చదువుకుంటూ… చదువు అంటే భయపడిన ఒక బాలుడు. అయినా తన కుమారుడు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి ప్రయోజకుడిగా మారాలని తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాస్టర్‌గా ఉన్న తండ్రి తన బిడ్డ కూడా మంచి నడవడికతో, దేవుని మార్గంలో నడవాలని కోరుకున్నారు. అందుకే బైబిల్ కాలేజీకి పంపించి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడ్డారు. కానీ పరిస్థితులు మారిపోయాయి… లోకానికి బానిసగా మారిన అతను బైబిల్ కాలేజీలో కూడా కొనసాగలేకపోయాడు. జీవితంలో ఒక దశలో పూర్తిగా దారి తప్పిపోయాడు. అయితే ఒకరోజు అతనే తన తండ్రికి ఫోన్ చేసి, *“నేను ఏలూరులో జ్యోతి రాజా గారి దగ్గర బైబిల్ కాలేజీకి వెళ్తాను”* అని చెప్పాడు. తండ్రి అతన్ని అక్కడికి పంపించారు. అక్కడి నుంచి అతని జీవితంలో దేవుని గొప్ప కార్యం ప్రారంభమైంది. 🙏 దేవుడు అతని జీవితాన్ని మార్చి, తన సేవ కోసం సిద్ధం చేశాడు. సేవలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాడు.