1 కోరింథీయులకు లేఖ 9

కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,

1 Corinthians 9:26 (UKJV) I therefore so run, not as uncertainly; so fight I, not as one that beats the air:

24పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

25మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

26కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,

27గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

Telugu Bible (Old Version), Bible Society of India.