మత్తయి సువార్త 6

మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

Matthew 6:11 (UKJV) Give us this day our daily bread.

9కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,

10నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,

11మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

12మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

Telugu Bible (Old Version), Bible Society of India.