27షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.
28వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
29బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
30హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
31దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.