మత్తయి సువార్త 23

మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.

Matthew 23:8 (UKJV) But be not all of you called Rabbi: for one is your Master, even Christ; and all you are brethren.

6విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను

7​సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.

8మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.

9మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.

10మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు.

Telugu Bible (Old Version), Bible Society of India.