కీర్తనల గ్రంథము 67

జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

Psalm 67:4 (UKJV) O let the nations be glad and sing for joy: for you shall judge the people righteously, and govern the nations upon earth. Selah.

2దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)

3దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)

4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

5దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.

6అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.

Telugu Bible (Old Version), Bible Society of India.