రోమీయులకు లేఖ 3

గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

Romans 3:11 (UKJV) There is none that understands, there is none that seeks after God.

9ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

10ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

11గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

12అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

13వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

Telugu Bible (Old Version), Bible Society of India.