1 కోరింథీయులకు లేఖ 9

నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.

1 Corinthians 9:3 (UKJV) Mine answer to them that do examine me is this,

1నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?

2ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వ మునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?

3నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.

4తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?

5తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?

Telugu Bible (Old Version), Bible Society of India.