ఆదికాండము 49

యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.

Genesis 49:18 (UKJV) I have waited for your salvation, O LORD.

16దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.

17దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

18యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.

19బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.

20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

Telugu Bible (Old Version), Bible Society of India.