పరమగీతము 6

నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.

Song of Solomon 6:3 (UKJV) I am my beloved's, and my beloved is mine: he feeds among the lilies.

1స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?

2ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.

3నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.

4నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు

5నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.

Telugu Bible (Old Version), Bible Society of India.